హీరోలు చాలా మంది ఉంటారు. రియల్ హీరోలు కొందరే. అటువంటి వారిలో సోనూ సూద్ కూడా ఒకరు అంటున్నాడు ఉమా సింగ్. పాతికేళ్ల సైకిలిస్ట్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వత శిఖరాగ్రం చేరుకున్నాడు. మొదట సైకిల్ పై కిలిమంజారో బేస్ పాయింట్ దాకా చేరుకున్న ఉమా అక్కడ్నుంచీ కాలి నడకన పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. ఆపైన ఆకాశమంత ఎత్తున నిలుచుని సోనూ సూద్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్ లో సోనూ…
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఓ చిరు వ్యాపారిని సర్ ప్రైజ్ చేశాడు సోనూ సూద్. నగరంలోని బట్మలు ప్రాంతంలో ఉన్న మార్కెట్లో హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యాడు సోనూ. అక్కడ షమీమ్ ఖాన్ అనే చెప్పుల వ్యాపారితో మాట కలిపాడు. రెండు రకాల చెప్పుల జతలు చేతిలోకి తీసుకుని చూసిన ఆయన రేట్స్ కనుక్కున్నాడు. డిస్కౌంట్ ఇస్తావా అంటూ సరదాగా అడిగాడు. ఆ తరువాత చిరు వ్యాపారి షమీమ్ భుజంపై చేయి వేసి “మీకు చెప్పులు కావాలంటే…
కరోనా కష్టకాలంలో అలుపెరుగని సామాజిక సేవతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. తాజాగా ఆయన తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. ఈ సందేశాలు నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో ఎప్పుడూ వ్యక్తపరచలేవు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్ళీ చూసేవరకు ఎప్పుడూ…
కరోనా కష్ట సమయంలో ఎంతోమందికి సహాయాన్ని అందించి రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా మారిన వ్యక్తి సోనూసూద్. కోవిడ్-19 ఫస్ట్ వేవ్ లో వలస కార్మికుల కోసం వారి సొంత ఊళ్లకు స్పెషల్ గా బస్సులు ఏర్పాటు చేశారు. సెకండ్ వేవ్ లో కరోనా పేషంట్స్ కు జెట్ స్పీడ్ లో మందులు, బెడ్స్, మెడిసిన్, ఆక్సిజన్ సరఫరా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించే పనిలో ఉన్నారాయన. ఇక…
నటుడు సోనూసూద్ లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ తన వంతు సాయం అందిస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ పై వార్తలు కూడా ఎక్కువైపోయాయి. అయితే తాజాగా సోనూ తన పెద్ద కుమారుడు ఇషాన్‌కి రూ.3 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారంటూ గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించాడు. ఇషాన్‌కి కారు కొనుగోలు చేసి బహుమతిగా కూడా ఇవ్వలేదని చెప్పాడు. ట్రయల్స్ కోసం మాత్రమే దానిని…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వారియర్స్ కు సంబంధించి టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వర్చువల్ మీటింగ్ కండెక్ట్ చేశారు. ఆ మీటింగ్ లో పాల్గొన్న సినీ నటుడు సోనూ సూద్ చంద్రబాబును ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ “హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశాను. కోవిడ్ పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవటం ఎంతో సంతోషం. ఆంధ్రా,…
మంత్రి కేటీఆర్, బాలీ వుడ్ స్టార్ సోనూ సూద్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. సోనూ సూద్ అయితే..కరోనా బాధితులు ఏ మూల నుంచి సహాయం కోరినా.. ఇట్టే చేసేస్తున్నాడు. ఇటు కేటీఆర్.. తెలంగాణ ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి అపన్నహస్తంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్యనే సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్…
ప్రజల ప్రాణాలను కాపాడటమే కాదు… విధివశాత్తు కన్నుమూసిన వ్యక్తుల అంత్యక్రియలు సైతం గౌరవ ప్రదంగా జరిగేందుకు చేయూతనిస్తున్నాడు నటుడు, మానవతా వాది సోనూసూద్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ఎంపిక చేసిన గ్రామాలకు ఆయన మృతదేహాలను భద్రపరిచేందుకు డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర వంటి కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు సోనూనూద్ ను ఇటీవల కలిసి, తమ గ్రామానికి…
కొవిడ్ -19 కారణంగా భారతి అనే అమ్మాయి ఊపిరితిత్తులు దాదాపు 85-90 శాతం దెబ్బతిన్నాయి. సోనూసూద్ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రి డాక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ఇ.సి.ఎం.ఓ. శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు వారు సోనూసూద్ కు తెలిపారు.…
ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ ప్రకటించారు. ఈరోజు మార్నింగ్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, తాను ఆల్రెడీ క్వారంటైన్ లో ఉన్నానని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను అని సోషల్ మీడియాలో తెలిపారు సోనూసూద్. అంతేకాదు ‘మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… దీనివల్ల మీ సమస్యలను తీర్చడానికి నాకు మరికొంత సమయం దొరుకుతుంది.…