విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ కథానాయకుడిగా నటిస్తూ, రచన-దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫతే’. సోనూ సూద్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఫతే చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, ఫతే నుంచి టీజర్ విడుదలైంది. 80 సెకన్ల నిడివి గల ఫతే టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుల్లెట్ల వర్షం కురిపించి, గన్…