ఉమ్మడి గుంటూరు జిల్లాలో మైనింగ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ మట్టితవ్వేస్తూ దోచుకుంటున్నారు మైనింగ్ మాఫియా. అదేమని అడిగితే పట్టించుకునే నాథుడు లేడు. అడిగితే అధికారులను కూడా భయపెట్టే స్థాయికి బెదిరింపులతో మట్టి మాఫియా మాట్లాడుతుండటంతో వారికి అధికారపార్టీలో కొంతమంది మద్దతు ఉందని ప్రచారం జరగటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రత్తిపాడు,పొన్నూరు, పెదకూరపాడు, వినుకొండ నియోకవర్గాల్లో రాత్రి అయితేచాలు ట్రాక్టర్లు లారీలు ప్రొక్లైనర్ల రీ సౌండ్…