కొందరు యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. లైక్స్, షేర్ల కోసం రీల్స్ చేస్తూ ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ యువకుడు ఢిల్లీ–లక్నో జాతీయ రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్‌పై వేలాడుతూ పుష్‌అప్స్ చేయడం కలకలం రేపింది. కింద వాహనాలు వేగంగా వెళ్తుండగానే, పైన రైల్వే బ్రిడ్జ్‌పై వేలాడుతూ…