Sniffer Dog: ప్రస్తుతం ఆర్మీతో పాటు ఇతర భద్రతా బలగాల్లో జాగిలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారానే చాలా వరకు ఆపరేషన్లను మన భద్రతా బలగాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేటకు స్నిఫర్ డాగ్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ముంబైలో తప్పిపోయిన పిల్లాడిని కేవలం 3 గంటల్లోనే కనుగొంది. "లియో" పేరు కలిగిన స్నిఫర్ డాగ్ అతడిని గుర్తించింది.
మేఘాలయలోని స్నైఫర్ డాగ్‌లలో ఒకటి మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత సరిహద్దు భద్రతా దళం కోర్టు విచారణకు ఆదేశించింది. డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి ఈ విషయంపై నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.