టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో స్మృతి 50 బంతుల్లో శతకం చేసి ఈ ఫీట్ సాధించింది. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పిన స్మృతి.. తొలి భారత బ్యాటర్‌గా తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన…