UPI LITE Payments: క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారా?.. మన ఫోన్‌లో డబ్బులు కట్ అవుతున్నాయి కానీ అవతలి వ్యక్తికి చేరట్లేదా?.. ఇలాంటి సమస్యలకు ఇక కాలం చెల్లింది. వీటికి పరిష్కారంగా UPI LITE సర్వీస్ వచ్చేసింది. యూపీఐ లైట్‌తో చెల్లింపులు చేయటానికి పిన్ నంబర్ కూడా అవసరంలేదు. కాబట్టి.. పేమెంట్.. ఫాస్ట్‌గా.. ఈజీగా.. పూర్తవుతుంది. ఈ లావాదేవీల్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం.