అంతరిక్ష పరిశోధన చరిత్రలో 2026 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. సుమారు అర శతాబ్దం క్రితం అపోలో మిషన్ల ద్వారా మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత, మళ్ళీ అంతటి సాహసోపేతమైన ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) సర్వం సిద్ధం చేసింది. తన ‘ఆర్టెమిస్’ ప్రోగ్రామ్‌లో భాగంగా అత్యంత కీలకమైన ‘ఆర్టెమిస్-2’ మిషన్‌ను ఫిబ్రవరి 6, 2026న ప్రయోగించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో నలుగురు వ్యోమగాములు చందమామ కక్ష్యలోకి వెళ్లి రానుండడం…