న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కాగా.. 462 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఈరోజు 3 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు. దీంతో.. భారత్ 107 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ (150), పంత్ (99) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగుల పట్టికను పరుగులు పెట్టించారు.