మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నంది. వేగంతో వచ్చిన స్కోడా కారు.. లారీని ఢీ కొట్టింది. దీంతో.. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.