రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదంటూ, ప్రభాకర్ రావు అరెస్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్ పాస్ వర్డ్ రీసెట్ చెయ్యాలని ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్…