పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై వచ్చిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నటిగా, నిర్మాతగా నిహారిక కొణిదెల ఈ చిత్రంతో అవార్డులు, రివార్డులు అందుకుంటూనే ఉన్నారు. థియేటర్లో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్‌గా రూ.18.5 కోట్లు వసూళ్లను రాబడితే, నాన్ థియేట్రికల్‌గా రూ.6 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తంగా సినిమా రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు అనేక వేదికలపై…
ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్‌లో గ్రాండ్ గా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో టాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. పలువురు నటీమణులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ,…