కనుమరుగైపోయింది అనుకున్న ర్యాగింగ్ భూతం మళ్లీ వచ్చింది..!! మరో అమాయక విద్యార్థిని బలి తీసుకుంది. మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్న సాయితేజ.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీనియర్లు కొట్టారని.. ర్యాగింగ్ చేస్తున్నారని.. డబ్బులు కావాలని వేధిస్తున్నారంటూ తండ్రికి సెల్ఫీ వీడియో పంపి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నగలకొండకు చెందిన సాయితేజ.. హైదరాబాద్ మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న రాత్రి తన…