మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శనివారం ఉదయం బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసంలో డీకే.శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్‌పై కొద్దిరోజులుగా ఫైటింగ్ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇటీవల రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పవర్ షేర్ చేయాల్సింది డీకే.శివకుమార్ వర్గం మొండిపట్టుపట్టింది.