Karnataka: కర్ణాటకలో బైక్ టాక్సీలకు హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ గతంలో వచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. చీఫ్ జస్టిస్ విభు బాఖ్రు, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కీలక తీర్పు వెలువరించింది. ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్లు దాఖలు చేసిన అప్పీల్స్‌ను అనుమతిస్తూ.. మోటార్‌సైకిళ్లను కూడా…