Amberpet SI Arrest: అంబర్‌పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీకి సంబంధించిన సొత్తును కాజేసి తాకట్టు పెట్టిన వ్యవహారంలో భాను ప్రకాష్ రెడ్డి పాత్ర వెలుగులోకి రావడంతో అరెస్ట్ చేశారు.