అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.