నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా, ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు.…