ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇప్పటికే నాలుగైదు సినిమాల్లో హీరోగా నటించాడు. అలానే నట దంపతులు రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ ‘దొరసాని’ మూవీతో తెరంగేట్రమ్ చేసింది. వీరిద్దరూ కలిసి ఇప్పుడో సినిమాలో నటించబోతున్నారు. దీనిని ‘తెల్లవారితే గురువారం’ మూవీ దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కిస్తున్నాడు. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ -2 గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జులై 6 నుండి ఈ చిత్రం రెగ్యులర్ జరుపుకోనుంది.…