Sharmistha Panoli: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివాదాస్పద పోస్ట్ పెట్టిన తర్వాత, ఇన్‌ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారనే ఆరోపణలపై ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పనోలికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.