(అక్టోబర్ 21న షమ్మీకపూర్ జయంతి)హిందీ సినిమా రంగంలో డాన్సింగ్ హీరోగా షమ్మీ కపూర్ పేరొందారు. ఆయన కంటే ముందు కొందరు నటులు డాన్సులు చేసినా, అవి ఒకటి, అరా ఉండేవి. కానీ, షమ్మీ కపూర్ మాత్రం తన పాటలకు తానే డాన్స్ కంపోజ్ చేసుకుంటూ నటించి, ‘డాన్సింగ్ హీరో’గానూ, ‘ఎల్విస్ ప్రిస్లీ ఆఫ్ ఇండియా’గానూ పేరొందారు. షమ్మీ ప్రతి చిత్రంలో ఏదో ఒక పాటలో ఆయన స్టైల్ ఆఫ్ డాన్సింగ్ కనువిందు చేసేది. అన్న రాజ్ కపూర్,…