యూపీలోని రాయ్‌బరేలీలో ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు గ్రామస్తులకు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.