వేసవి తాపం నుంచి వాహనదారులను రక్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్‌ఎంసీ ) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో హిమాయత్ నగర్‌లోని లిబర్టీ రోడ్డులో గ్రీన్ మెష్ ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రధాన జంక్షన్‌లలో, ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద ఎక్కువసేపు నిలిచిపోయే జంక్షన్‌లలో ఇలాంటి షేడ్ కానోపీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఏరియా ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవిలో బాటసారులకు విశ్రాంతి కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది శనివారం మెష్‌ను ఏర్పాటు…