Chandra Grahan: సెప్టెంబరు 7న భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం రాత్రి 9గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉంటుందని పలువురు జ్యోతిష్యనిపుణులు తెలిపారు. సూత కాలం, ఏయే రాశివారు గ్రహణం చూడకూడదనే అంశాలతో పాటు ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: CM Revanth Reddy : ఆకస్మికంగా ట్యాంక్‌బండ్ చేరుకున్న సీఎం రేవంత్…
సెప్టెంబరు 7న చంద్రగ్రహణం రాబోతోంది. భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మనకు విశేషంగా శతభిష నక్షత్రంలో, కుంభ రాశిలో ఏర్పడబోతోంది. చిలకమర్తి పంచాంగ రీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ చంద్ర గ్రహణం రాత్రి 9గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే.. చంద్రగ్రహణం రోజు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..