Chandra Grahan: రేపే చంద్రగహణం.. ఈ రాశుల వాళ్లు జర జాగ్రత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandra Grahan: సెప్టెంబరు 7న భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం రాత్రి 9గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉంటుందని పలువురు జ్యోతిష్యనిపుణులు తెలిపారు. సూత కాలం, ఏయే రాశివారు గ్రహణం చూడకూడదనే అంశాలతో పాటు ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: CM Revanth Reddy : ఆకస్మికంగా ట్యాంక్‌బండ్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
5 గంటల లోపు ఆలయాలు మూసివేయాలి..
ఈసందర్భంగా పలువురు జ్యోతిష్యనిపుణులు మాట్లాడుతూ.. గ్రహణ వ్యవధి కాలం మూడు గంటల 30 నిమిషాలు ఉంటుందన్నారు. రాత్రి 11.42 నిమిషాలకు గ్రహణ మధ్యస్థ కాలమని పేర్కొన్నారు. ఈ చంద్ర గ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనబడబోతోందని, భారతదేశంపైనా దీని ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ గ్రహణం వల్ల దేశంలోని ఆలయాలన్నీ ఏడో తేదీ సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలని చెప్పారు. తర్వాతి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించాలని పేర్కొన్నారు. భారత్, రష్యా, సింగపూర్, చైనాలో కొన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం ఆరు గంటల లోపే భోజనాది నియమాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగేవరకూ ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిదని చెప్పారు.
ఈ గ్రహణంలో కుంభ, మీనం, మిథునం, సింహ రాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని సూచించారు. గ్రహణం సమయంలో రాహు జపం చేయడం, దుర్గా దేవిని పూజించడం, పట్టు విడుపు స్నానాలు ఆచరించడం, వెండి వంటివి దానం చేయడం వంటివి శుభఫలితాలు ఇస్తాయని చెప్పారు. కొన్ని రాశుల వారికి (కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం) ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శాస్త్రం ఏం చెబుతుంది..
గ్రహణ సమయంలో నిద్ర పోవద్దన్నదని శాస్త్రం చెప్తున్నట్లు పేర్కొన్నారు. చంద్ర గ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమమని సూచించారు. గ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉంచడం మంచిదన్నారు. గ్రహణ కాల వ్యవధిలో ఇంటి లోపలే ఉండేలా చూసుకోండని సూచించారు.
READ ALSO: Shocking Crime: స్నేహితుడితో చూడకూడని స్థితిలో భార్య.. మరణశాసనం రాసిన భర్త..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!