హైదరాబాద్ పెద్దమ్మతల్లి గుడి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్ ను పేస్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. శేజల్ కి ఎమర్జెన్సీ బ్లాక్ లో చికిత్స అందిస్తున్నట్లు.. శేజల్ ఔటాఫ్ డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఆయుర్వేదిక్ సంబంధించిన నిద్ర మాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. మరికొద్దిసేపట్లో శేజెల్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు పేస్ అసుపత్రి వైద్యులు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై గతంలో ఆరోపణలు చేసిన షేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఆదినారాయణ రావు షేజల్ ను పెద్దమ్మతల్లి గుడి వద్ద వదిలివెళ్లాడు. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్.. ఇవాళ మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే తన దగ్గర సరైన ఆధారాలు లేవు అన్న మాటలకి షేజల్ మనస్థాపం చెంది.. నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది.