రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బు చాలామందికి అదనపు ఆదాయం కాదు. అదే జీవనాధారం. బ్యాంక్‌లో వేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే మందులు కొనాలి, కిరాణా సరుకులు తీసుకోవాలి, ఇంటి రోజువారీ ఖర్చులు చూసుకోవాలి. కానీ ఇలాంటి వడ్డీ ఆదాయంపై ఇచ్చే పన్ను రాయితీలు సంవత్సరాలుగా మారలేదు. మరోవైపు ధరలు పెరుగుతున్నాయి. వైద్య ఖర్చులు పెరిగాయి. వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లు, స్మాల్ సేవర్స్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఫిబ్రవరి…