బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి షణ్ముఖ్, సిరి ఒక్కటిగానే ఏ గేమ్ అయినా ఆడుతున్నారు. ఒకరికి ఒకరికి సాయం చేసుకోవడం లేదని మిగిలిన ఇంటి సభ్యులతో బుకాయించినా, కొన్ని సందర్భాలలో వీరిని నిలదీసినప్పుడు ‘అది మా స్ట్రేటజీ’ అంటూ తప్పించుకునే వారు. ఈ ఇద్దరికీ ఆ తర్వాత జెస్సీ జత కలిశాడు. ముగ్గురూ కలిసి గూడుపుఠాణీ చేస్తున్నారంటూ కొందరు వీరికి ముద్దుగా త్రిమూర్తులు అనే పేరూ పెట్టారు. అయితే, రెండు వారాల క్రితం…