సంగారెడ్డి జిల్లా నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ పోస్ట్ మొన్న మే 31న ఖాళీ అయింది. అప్పటిదాకా ఎస్ఈగా పని చేసిన యేసయ్య పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది కుర్చీ. అదేం పెద్ద విషయం కాదుగానీ... అందులో కూర్చునేందుకు ఆఫీసర్స్ అంతా భయపడటమే ఇప్పుడు అసలు సమస్య. పిలిచి ఎస్‌ఈ పోస్ట్ ఇస్తామన్నా... ఆసక్తి చూపడం లేదట అధికారులు.