Oscar 2023: అమెరికాలో ఇది సినిమా అవార్డుల సీజన్ అనే చెప్పాలి. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 6 న సాయంత్రం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి పలు సినిమా అవార్డుల సంస్థలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఆస్కారేతర అవార్డుల ప్రభావం ఆస్కార్స్ పై ఉంటుందనీ కొందరు చెబుతున్నారు.