తన హత్యకు రెక్కీ జరుగుతోందని ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని వంగవీటి రాధా కార్యాలయం ముందు గత కొన్నిరోజులుగా పార్క్ చేసిన స్కూటర్ అనుమానాస్పదంగా మారడంతో రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్క్ చేసిన స్కూటర్ ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: బీమా కంపెనీల ఆఫర్… పెళ్లి క్యాన్సిల్…
75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నది. రూ.499 చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అత్యధికంగా అడ్వాన్డ్స్ బుకింగ్ జరిగిన స్కూటర్‌గా ఓలా రికార్డ్ సాధించింది. ఇక ఓలా స్కూటర్ ప్రత్యేకతల గురించి ఆ కంపెనీ ప్రతిరోజూ ప్రచారం చేస్తే వస్తుండటంతో ఆసక్తి నెలకొన్నది. ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ పేర్కొన్నది. 0 నుంచి…