తెలంగాణలో విద్యాసంస్థలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. వానలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. పాఠశాలలతో పాటు కాలేజీలు, యూనివర్సిటీలు తెరుచుకోనున్నాయి. అయితే గత వారం 11వ తేదీన భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే దీంతో అలర్ట్ అయిన విద్యాశాఖ.. విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈనేపథ్యంలో తిరిగి నేటి (సోమవారం) నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. వారం రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకోనున్నాయి.…