ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కోవిడ్ నిర్ధారణ కోసం చేయించుకునే స్కానింగ్ ధరలను నియంత్రించింది ఏపీ ప్రభుత్వం. సీటీ స్కాన్, హెచ్చార్ సీటీ స్కాన్ ధరను రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులతో పాటు ఆస్పత్రుల్లోనూ సీటీ స్కాన్ నిమిత్తం రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని…