Off The Record: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ రాజకీయం మొత్తం దొమ్మేరు దివాణం చుట్టూనే తిరుగుతోందట. దొమ్మేరు జమిందార్ వంశానికి చెందిన పెండ్యాల అచ్చిబాబు ఇక్కడ కింగ్ మేకర్ అవతారం ఎత్తి ఎమ్మెల్యే సహా అందర్నీ వేళ్ళ మీద ఆడిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో కూడా ఇదే తరహా పెత్తనం నడిచినా… ఈ మధ్య కాలంలో మాత్రం వ్యవహారం శృతిమించిపోయిందని అంటున్నారు. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో పేరుకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు…