AP Government: చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు చేనేత మరియు టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చేనేతలకు అండగా ఉంటామని మాట ఇచ్చాం. గతంలో టీడీపీ ఎన్టీఆర్ కాలం నుంచి చేనేతలకు…