Saudi Bus Accident: సౌదీ రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు హైదరాబాదీలు సజీవదహనమయ్యారు.. మొదటి కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు..