హైదరాబాద్ శివారు నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్‌పై వేధింపులు నిజమేనని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది. శ్రీచైతన్య కాలేజీపై విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది.
హైదరాబాద్ నగర శివారులో గల నార్సింగిలోని ఓ ఇంటర్ కళాశాలలో విద్యార్థి తరగతి గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా సాత్విక్ సూసైడ్ నోట్‌లో పలు విస్తుపోయే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.