Road Accident : మధ్యప్రదేశ్‌లోని సత్నాలో శనివారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. మజ్గవా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రకూట్ రోడ్డులో మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో దారుణం జరిగింది. అప్పటి వరకు ఆహ్లాదంగా జరిగిన కుటుంబ కార్యక్రమంతో హత్య జరిగింది. ఫంక్షన్‌లో డ్యాన్స్ చేయనీకుండా, మ్యూజిక్ ఆపేసినందుకు ఒక వ్యక్తి తన అన్నని గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు ఆదివారం తెలిపారు. కోఠి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌహార్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్ కోల్(30)ని పోలీసులు అరెస్ట్ చేశారు.