రచయితలుగా పరుచూరి బ్రదర్స్ తెలుగునాట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక వారు దర్శకులుగా మారి ఓ తొమ్మిది చిత్రాలు రూపొందించారు. ‘కాయ్ రాజా కాయ్’ అంటూ మెగా ఫోన్ పట్టిన ఈ బ్రదర్స్, సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ‘శ్రీకట్న లీలలు’కు కూడా దర్శకత్వం వహించారు. ఆ తరువాత మరో ఆరేళ్ళకు అదే సంస్థలో శోభన్ బాబు ప్రధాన పాత్రలో ‘సర్పయాగం’ రూపొందించారు. ఇందులో శోభన్ కు రోజా కూతురుగా నటించడం విశేషం.…