కర్నూలులో జరిగిన సర్కారు వారి పాట సక్సెస్ మీట్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు వేదికపై తొలిసారి స్టెప్పులేసి, ఆ ప్రాంగణాన్ని హుషారెత్తించారు. ఆ తర్వాత ప్రసంగిస్తూ.. తనకోసం తరలివచ్చిన మీ (ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ) కోసమే తాను మొదటిసారి స్టేజ్‌పై డ్యాన్స్ చేశానని అన్నారు. అప్పుడెప్పుడో ఒక్కడు షూట్ కోసం కర్నూల్ వచ్చానని, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత సర్కారు వారి పాట సక్సెస్ మీట్ కోసం వచ్చిన తనని చూసేందుకు ఇంతమంది అభిమానులు రావడం చాలా…