టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో సత్తాచాటిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ (150)తో జట్టును ఘోర పరాభవం నుంచి తప్పించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెన్సేషన్ అయ్యాడు. ఎటాకింగ్ ఆటతో ఆకట్టుకున్న సర్ఫరాజ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అదే సమయంలో బీసీసీఐపై సెటైర్స్ వేశాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల…