తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతర తుదిదశకు చేరుకుంది. ఈ నెల 16న ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ వైభవోపేతంగా జరుగుతోంది. సమ్మక-సారక్క జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ భక్తులు విచ్చేశారు. అమ్మవార్లకు బంగారాన్ని (బెల్లం) సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను రాజకీయ ప్రముఖలు కూడా ఇప్పటికే దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యలో నేడు తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా అమ్మవార్లను దర్శించుకోనున్నారు.…