తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు. వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ “1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్ట్‌కు షఫైర్ సూట్ పేరుతో మొదలుపెట్టాం. పెండింగ్‌లో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత.…