Home
Sankranthi2022
Sankranthi2022 News
-
నేడు కోనసీమలో ప్రభల ఉత్సవం..
తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో నేడు ప్రభల ఉత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై… ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. కనుమ పండుగ రోజున ప్రభల… -
అచ్చ తెలుగు అందంలో సంక్రాంతి ముద్దుగుమ్మలు..
సంక్రాంతి.. తెలుగువారి అతిపెద్ద పండగ.. ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు.. పిండి వంటలు.. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో కనిపించే అమ్మాయిలు. ఇక ఈరోజు అమ్మాయిలందరూ ఎంతో పద్దతిగా చీరకట్టు.. బొట్టు పెట్టుకొని ముగ్గులు వేస్తూ దర్శనమిస్తారు. అయితే హీరోయిన్లు కూడా మేము మాత్రం తక్కువా అంటూ చీరకట్టులో దర్శనమిచ్చి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తారల చీరకట్టు తళుకులు ట్రెండింగ్ గా మారిపోయాయి. మరింకెందుకు ఆలస్యం ఈ సంక్రాతి ముద్దుగుమ్మలు..… -
తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : గవర్నర్ తమిళిసై
సంక్రాంతి సందర్భంగా రాజ్ భవన్‌లో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై దంపతులు, బంధువులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో రాజ్ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ తయారు చేశారు. అనంతరం గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తూ పండుగ జరుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు… -
సంక్రాంతి ఎఫెక్ట్ : బోసిపోయిన భాగ్యనగరం..
నిశీది వేళలో సైతం నిద్రించని భాగ్యనగరం ఇప్పడు బోసిపోయింది. సంక్రాంతి పండుగ వేళ.. పట్నంవాసులు పల్లెలకు పరుగులు తీశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపి.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లో బంధుమిత్రులతో గడిపేందుకు ప్రజలు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ఎప్పడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి. అటు ఏపీకి చెందిన వారు ఆంధ్రాకు పయనమైతే.. ఇటు తెలంగాణలోని వారి సైతం తమ ఊర్లకు… -
సంక్రాంతికి రిటర్న్ గిఫ్ట్.. కరోనా పాజిటివ్..?
సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగువారింట సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో సంక్రాంతి పండుగను తెలుగువారు నామమాత్రంగానే జరుపుకున్నారు. అయితే మొన్నటి వరకు కరోనా రక్కసి తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలపై ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. దీంతో మళ్లీ కరోనా కేసులు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఏపీలో సంక్రాంతి… -
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ..
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను తెలుగురాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు.. ఘుమఘుమలాడే పిండివంటలు, పిల్లల ఆటపాట, గాలిపటాల హుషారుతో ఇళ్లంతా కోలాహలంగా మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగింటి లోగిళ్లు రంగవల్లులతో దర్శనమిస్తున్నాయి. ఉదయాన్నే లేచేసరికి చలిగాలి పలకరింపుతో పులకరించి, పుణ్యస్నానాలచరించి కొత్తబట్టలు వేసుకొని చిన్నాపెద్దా తేడాలేకుండా హుషారుగా… -
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై
సంక్రాంతి పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగ సంక్రాంతి అందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. అన్నివర్గాలను సంక్రాంతి వేడుకలు దగ్గర చేస్తాయని తెలిపారు. సంక్రాంతి శుభసందర్భంగా అందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేలా అందరూ కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలకు లోబడే సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని గవర్నర్ సూచించారు. సంపన్నమైన ఆరోగ్యవంతమైన… -
తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ బట్టల్లో కనిపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలోని గోశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పల్లెటూళ్లలో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తారో వాటిని అన్నింటినీ తాడేపల్లి… -
నేను చావాలని కోరుకొనేవారందరికి సంక్రాంతి శుభాకాంక్షలు- ఆర్జీవీ
సాధారణంగా పండగకు ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని కోరుకుంటారు. తమ జీవితంలో మంచి రోజులు రావాలని, ఐశ్వర్యారోగ్యాలు ఉండాలని, తమతో పాటు అందరు కూడా బావుండాలని కోరుకుంటారు. మంచి తెలుస్తూనే శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే అందరిలా చెప్తే తనకు వాల్యూ ఏముంటది అనుకున్నాడో.. లేక నా తీరే ఇంత అని మరోసారి నిరూపిద్దామనుకున్నాడో.. వివాదాల దర్శకుడు వెరైటీగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భగవంతుడు మీలో ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు… -
సంక్రాంతి మొత్తం ఈ జంటలోనే కనిపిస్తుందే..
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో హీరో సూర్య- జ్యోతిక జంట ఉంటారు. 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ కొత్త దంపతులలానే కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య హీరోగా, నిర్మాతగా కొనసాగుతుండగా.. జ్యోతిక సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. తమిళనాట అతిముఖ్యమైన పండగల్లో సంక్రాంతి ఒకటి. వారు కూడా సంక్రాంతాని ఎంతో ఘనంగా…
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!