ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు.. నిద్రలోనూ.. భవిష్యత్ కార్యచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ.. కనివిని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా ముందు మోకరిళ్లింది అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పెట్టి, ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్‌డౌన్‌తో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు.…