Sanju Samson React on Rajasthan Royals Defeat vs Sunrisers Hyderabad: మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే తమ ఓటమికి కారణం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము ఊహించిన విధంగా పిచ్ లేదని, రెండో ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయిందన్నాడు. గత మూడేళ్లుగా తాము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామని, ఇదంతా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైందన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను భారత జట్టుకు…