Sanaya Irani Sensational Casting Couch Allegations: బాలీవుడ్‌లోనూ, సౌత్‌లోనూ కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని నటి సనయా ఇరానీ ఇటీవల వెల్లడించింది. షూటింగ్ సమయంలో సనయను బికినీ ధరించమని సౌత్‌కి చెందిన ఓ పెద్ద దర్శకుడు అడిగాడట. అయితే, కాలక్రమేణా, నటి ఆ దర్శకుడి ఉద్దేశాలను అర్థం చేసుకుని అతనితో కలిసి పని చేయడం ఆపేసినట్టు వెల్లడించింది. నటి స్పందిస్తూ, ‘చాలా కాలం క్రితం, దక్షిణాదికి చెందిన ఒక వ్యక్తి నన్ను సినిమాకి సంబంధించి కలవాలనుకున్నాడు.…