Annamalai: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. చివరకు ఆయన తండ్రి, సీఎం స్టాలిన్ కూడా కొడుకు వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు డీఎంకే పార్టీతో పాటు ఆ పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో డీఎంకేని, కాంగ్రెస్, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తోంది. ఇండియా కూటమి హిందుమతానికి ద్వేషిస్తోందని బీజేపీ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Rajnath Singh: సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అశోక్ గెహ్లాట్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ ప్రారంభించిన పరివర్తన యాత్ర సందర్భంగా జైసల్మీన్ లో ఆయన కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.