యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో కథానాయికగా నటించిన సంయుక్త, సినిమా విశేషాలను పంచుకోవడానికి మీడియా ముందుకు వచ్చారు. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే సంక్రాంతి సందడి.. క్లీన్ కామెడీ! సంక్రాంతి పండుగ వేళ తన సినిమా విడుదల కావడం పట్ల సంయుక్త ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. “పెద్ద పండుగ రోజున వస్తున్న…