మళ్లీ సమంత సౌత్ ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తుందా అంటే ఔననే టాక్ వినిపిస్తోంది. ఖుషి తర్వాత కనిపించని సామ్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ‘శుభం’లో మాయగా మెరిసింది. ట్రలాలా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం తెరకెక్కించి నిర్మాతగా డీసెంట్ హిట్ కొట్టేసింది. ఇక ఇదే నిర్మాణ సంస్థలో ఎనౌన్స్ చేసిన ‘మా ఇంటి బంగారం’ ఆగిపోయిందన్న వార్తలకు రీసెంట్లీ చెక్ పెట్టేసి ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పింది. నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం…